Saturday 5 April 2014

T R S Manifesto

మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను
విడుదల చేశారు.
అందులోని ముఖ్యాంశాలు:
ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్
రైతులను లక్షాధికారులను చేస్తాం
భూమిలేని నిరుపేదలకు 3 ఎకరాల చొప్పున భూమి సంవత్సరం పెట్టుబడి
ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు
రైతులకు లక్ష రూపాయల వరకు క్రాఫ్ లోన్ మాఫీ
వికలాంగులకు రూ. 1500, వృద్ధులు, వితంతువులకు రూ. 1000 పెన్షన్
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం
తెలంగాణలో కొత్తగా 14 జిల్లాలు ఏర్పాటు చేస్తాం
అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం
తెలంగాణ చెరువులు, కుంటలకు పాత వైభవం తీసుకొస్తాం
సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను తీర్చి దిద్దుతాం
సంచార్ కమిటీని తూచా తప్పకుండా అమలు చేస్తాం
లక్షల కోట్ల విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైనయి వాటిని విడిపించేందుకు టీఆర్‌ఎస్ సుప్రీంకోర్టులో కేసులు వేసింది. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు ఇస్తాం
రాష్ట్ర పండుగగా బతుకమ్మ
హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్‌ల ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్‌లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు
బలహీనవర్గాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
కొత్తగా పది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు
కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపనతో లక్ష మందికి ఉద్యోగాలు, ఉపాధి
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంధ విద్య
మూడేళ్లకోసారి ఉద్యోగుల బదిలీ
ఆటోలకు రవాణా పన్ను నుంచి మినహాయింపు
గృహనిర్మాణ లబ్ధిదారుల రుణాలు మాఫీ
తెలంగాణ భూముల వివరాలు కంప్యూటరైజేషన్
వ్యవసాయరంగంలో అధునిక పద్దతులు తెస్తాం

No comments:

Post a Comment